: మోడీ, కేజ్రీవాల్... కబీర్ ‘గంధపు మాల’ గురించి మీకు పట్టదా?: సంత్ వివేక్ దాస్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గంగాతీరంలో విజయం కోసం పాకులాడుతున్నారని కబీర్ చౌరా మఠ్ ట్రస్ట్ చీఫ్ సంత్ వివేక్ దాస్ విమర్శించారు. గతేడాది నుంచి కనిపించకుండా పోయిన 600 ఏళ్లనాటి కబీర్ ‘గంధపు మాల’ గురించి వారికి పట్టదా? అని ఆయన ప్రశ్నించారు. "మోడీ, కేజ్రీవాల్ సహా వారణాసిలో పోటీ చేస్తున్న ఏ ఒక్క అభ్యర్థి దీని గురించి మాట్లాడటం లేదు. ఇది ఈ ఆధ్యాత్మిక నగరంతో ముడిపడిన అతి సున్నితమైన అంశం" అని ఆయన అన్నారు. తాను ఈ విషయాన్ని విదేశాంగ శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివేక్ దాస్ తెలిపారు.

  • Loading...

More Telugu News