: అహ్మద్ పటేల్ నాతో చెప్పాడు: కేఏ పాల్
తాము వంద లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ తనతో చెప్పారని క్రైస్తవ ప్రచారకుడు కేఏ పాల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తాము రానున్న పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటామని అహ్మద్ పటేల్ అన్నారని చెప్పారు. కోట్ల రూపాయల లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టగల నేత చంద్రబాబు నాయుడే అని కేఏ పాల్ తెలిపారు.
అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడాలని ఆయన తెలిపారు. 140 దేశాలు తిరిగిన వ్యక్తిగా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తనకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. పెప్పర్ స్ప్రేలు, పార్టీలు పెట్టడాలు... అన్నీ 10 జనపథ్ మార్గదర్శకత్వంలోనే జరిగాయని, అందుకే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అడుగుపెట్టగలిగారని ఆయన విమర్శించారు.