: రూ.75 ఎక్కువ తీసుకున్నందుకు రూ.50 లక్షల జరిమానా
75 రూపాయల కోసం కక్కుర్తిపడ్డ ఓ షాపు యజమానికి జాతీయ వినియోగదారుల ఫోరం 50 లక్షల జరిమానా విధించి చెంప చెళ్లుమనిపించింది. ఢిల్లీకి చెందిన డీకే చోప్రా 2009 అక్టోబర్ లో ఓ రోజున చెన్నై విమానాశ్రయంలో ఓ షాపు నుంచి రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేశాడు. దాని ఎంఆర్పీ 75 రూపాయలు అయితే, షాపు అతను 150 రూపాయలు వసూలు చేశాడు. దీనిపై చోప్రా జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. తన మానసిక వేదనకు 2 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరాడు. కానీ ఫోరం అతడి పిటిషన్ ను కొట్టివేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కు వెళ్లినా అక్కడా న్యాయం దక్కలేదు. దాంతో అతడు జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఆధారాలను పరిశీలించిన ఫోరం సదరు షాపు నిర్వాహకుడికి ఏకంగా 50లక్షల జరిమానా విధించింది. దీంతోపాటు చోప్రాకు 10వేల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.