: రాజానగరంలో 4176 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయ్!


తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో మద్యం ఏరులై పారుతోంది. రాజానగరం హైవేపై కల్వచర్ల సెంటర్ లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 4,176 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యం బహిరంగ మార్కెట్లో రూ. 2.60 లక్షలు విలువ ఉంటుందని రాజానగరం పోలీసులు చెప్పారు. గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామస్థులకు పంపిణీ చేసేందుకే ఈ మద్యాన్ని తీసుకెళుతున్నారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News