: టీచర్ కఠినత్వంతో విద్యార్థికి శస్త్రచికిత్స
ఓ టీచర్ రాక్షసత్వం ఒక విద్యార్థి మోకాలు దెబ్బతినడానికి కారణమైంది. రాజస్థాన్ లోని కోటా పట్టణంలో ఓ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షల్లో టీచర్ అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు రాయలేకపోయాడు. దీంతో ఆ మహిళా టీచర్ వందసార్లు కింద కూర్చొని పైకి లేవాలని ఆదేశించింది. బాలుడు అదే పనిచేశాడు. ఆ తర్వాత నుంచి అతడు సరిగా నడవలేకపోవడం, తీవ్ర నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో టీచర్ వేసిన శిక్షను తలచుకుని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.