: టీడీపీలో చేరిన నలుగురు జేఎస్పీ శాసనసభ అభ్యర్థులు
సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న తరుణంలో ఏకంగా నలుగురు జేఎస్పీ అభ్యర్థులు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ స్థానాల నుంచి పోటీచేస్తున్న సత్యారెడ్డి (మాచర్ల), అప్పిరెడ్డి (గురజాల), ఆంజనేయులు (చిలకలూరిపేట), రమేష్ బాబు (వినుకొండ)లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నరసరావుపేట లోక్ సభ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు.