: 21కి పెరిగిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో నిన్న దివా-సావంత్ వాడి పాసింజర్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగింది. గాయపడిన 120 మంది సమీపంలోని నాగోథానె, రోహా, అలీబాగ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా దెబ్బతిన్న ట్రాక్ ను మరమ్మతు చేసి ఈ తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైలు పట్టా విరిగిపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.