: టీకాంగ్ నేతలతో కాసేపట్లో పొన్నాల కీలక సమావేశం


తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ భేటీకి అన్ని జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? ఏయే స్థానాలు గెలుచుకుంటుంది? అనే అంశంపై వీరంతా కలసి సమీక్షించనున్నారు. అనంతరం ఈ అంశానికి సంబంధించి అధిష్ఠానానికి నివేదిక అందజేస్తారు. దీనికి తోడు ఈ నెల 12న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ లు, జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News