: తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం
గతేడాది ప్రకృతి విలయతాండవానికి గురైన ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకున్నాయి. గంగా ప్రవాహం ధాటికి ఆలయ సందర్శనానికి వచ్చిన 5 వేల మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేదార్ నాథ్ ఆలయం దర్శనానికి భక్తులు పోటెత్తారు. తొలి రోజు సుమారు 1252 మంది భక్తులు, 8 మంది విదేశీయులు పరమశివుడ్ని దర్శించుకున్నారు. ఈ దేవాలయం కొన్ని నెలల పాటు మాత్రమే తెరచి ఉంటుంది.