: అతిగా ఆశపడే జగన్, అతిగా ఆవేశపడుతున్న షర్మిల బాగుపడరు!: నారా లోకేష్
చిత్తూరు జిల్లా పాకాలలో టీడీపీ నేత నారా లోకేష్ ఈ రోజు రోడ్ షో నిర్వహించారు. లోకేష్ తో పాటు టీడీపీ అభ్యర్థి గల్లా అరుణ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఆశపడే జగన్, అతిగా ఆవేశపడుతున్న షర్మిల చరిత్రలో బాగుపడలేరని ఎద్దేవా చేశారు. బాలకృష్ణపై షర్మిల చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు.
600 ట్రక్కుల నకిలీ మద్యం సరఫరాకు జగన్ సర్వం సిద్ధం చేశారని లోకేష్ ఆరోపించారు. ఈ నకిలీ మద్యం ఓటర్లకు చేరకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబును గెలిపిస్తే... జిల్లాకో సైబరాబాదును నిర్మించుకోవచ్చని చెప్పారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన వైకాపాకు ఓటేస్తే చంచల్ గూడ జైలుకు వేసినట్టేనని చెప్పారు.