: శ్రీనివాసన్ ను అడ్డుకోండి: ఐసీసీకి బీహార్ కార్యదర్శి లేఖ


బీసీసీఐ ఛైర్మన్ గా వచ్చే నెల ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశానికి హాజరుకానున్న శ్రీనివాసన్ ను అడ్డుకోవాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ కార్యదర్శి ఆదిత్య వర్మ ఐసీసీని అభ్యర్థించారు. ఐపీఎల్ కుంభకోణం గురించి ఐసీసీ ఇప్పటివరకు ప్రశ్నించలేదని ఆరోపించిన ఆదిత్య వర్మ, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఐసీసీ కార్యక్రమాలకు హాజరుకాకుండా శ్రీనివాసన్ ను నిలువరించాలని కోరారు. ఈ మేరకు ఐసీసీ ఛైర్మన్ అలన్ ఇసాక్ కు ఆయన లేఖ రాశారు.

  • Loading...

More Telugu News