: కేసీఆర్ ను ప్రశ్నించలేని జగన్ ఎలా రక్షణ కల్పిస్తారు: పవన్ కల్యాణ్
సీమాంధ్ర ప్రజలపై అవాకులు చవాకులు మాట్లాడిన కేసీఆర్ ను ఏనాడూ ప్రశ్నించని జగన్ సీఎం కాలేరని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన మాట్లాడుతూ, తెలుగుజాతి ఐక్యతను జగన్ దెబ్బతీశారని అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోలేక, కడపు మండి, గుండె రగిలి తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. 2014 ఎన్నికలు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేవని ఆయన తెలిపారు. పరిపాలనలో అనుభవమున్న చంద్రబాబును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిపోతుందని, జగన్ అవినీతితో వేల కోట్లు దోపిడీ చేసి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటాడని ఆయన అన్నారు.