: నాపై ఆరోపణలను రావుల నిరూపించాలి: వైఎస్ అవినాష్ రెడ్డి


తన బ్యాంకు అకౌంట్లలోకి విదేశాల నుంచి రూ. 100 కోట్లు వచ్చాయని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను కడప లోక్ సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. మన రాష్ట్రంలోని ఏ బ్యాంకు అకౌంటుకు సింగపూర్ నుంచి డబ్బు బదిలీ అయిందో చెప్పాలని అన్నారు. తనపై రావుల అసత్య ఆరోపణలు చేస్తున్నారని... వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టీడీపీ ఆఫీసులో రాసిచ్చిన స్క్రిప్టును రావుల చదివి వినిపించారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News