: కాంగ్రెస్ కు 45-50 స్థానాలు వస్తాయి: జానారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 50 స్థానాల వరకు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఫలితాలకు సంబంధించి గోబెల్స్ ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న లగడపాటి రాజగోపాల్ సర్వేలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. నల్లగొండ జిల్లాలో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ లేరన్న గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకున్నారు.