: పోలవరం ప్రాజెక్టు కేసీఆర్, కవితల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేదు: జైరాం రమేష్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్, కవితల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. సీమాంధ్ర పర్యటనలో ఆయన మాట్లాడుతూ, జలాలు రానివ్వమంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు అనుచితమని అన్నారు. నీటి పంపకాల వ్యవహారం కృష్ణా జలాల బోర్డు చూసుకుంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల తరువాత జగన్ బీజేపీలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వల్లే పార్టీ దెబ్బతిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభాలను వివరించడంలో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.