: శత్రుఘ్నుడికి ఆరోగ్య శాఖ మంత్రి పదవి కావాలట


తన విజయం, ఎన్డీయే విజయం ఖాయమని నటుడు శత్రుఘ్నసిన్హా డిసైడైనట్లున్నారు. మోడీ ప్రధాని కావడం ఖాయమని, ఆయన మంత్రివర్గంలో తనకు ఆరోగ్యశాఖ దక్కితే సంతోషిస్తానంటూ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈయన బీహార్ లోని పాట్నా సాహిబ్ (పాట్నా జిల్లా) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తాను చేపట్టిన పనులను ఇప్పుడు కొనసాగించాలంటే ఆ శాఖ అయితేనే బావుంటుందన్నది ఆయన అభిప్రాయం.

  • Loading...

More Telugu News