: మహిళా ప్రయాణికురాలికి టాయిలెట్ నిరాకరించినందుకు జరిమానా


ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అమానవీయంగా వ్యవహరించిన కేసులో వినియోగదారుల ఫోరం పశ్చిమ రైల్వేకు 25వేల రూపాయల జరిమానా విధించింది. ఓ ప్రయాణికురాలు ముంబై లో ములుంద్ నంచి మలాద్ కు 2007 జనవరి 3న ప్రయాణిస్తోంది. దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు రుతుచక్రం మొదలైంది. దాంతో టాయిలెట్ కోసం వెతకగా బుకింగ్ ఆఫీసు వద్ద ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉండడంతో తెరిపించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏ ఒక్క రైల్వే ఉద్యోగీ స్పందించి దాన్ని తీయలేదు. దీనిపై తర్వాత ఆమె వినియోదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. రైల్వే నిర్లక్ష్యాన్ని గుర్తించిన వినియోగదారుల ఫోరం జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News