: మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు... నలుగురు మృతి!
మహారాష్ట్రలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. నలుగురు మరణించి ఉండచ్చని భావిస్తున్నారు. 25 మందికి గాయాలు అయ్యాయి. మృతుల విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొంకణ్ రైల్వే పరిధిలో దివా, రోహ స్టేషన్ల మధ్య రైలు ఇంజన్ తోపాటు, నాలుగు కోచ్ లు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే చర్యలు చేపట్టారు.