: సీమాంధ్ర అభ్యర్థుల్లో 146 మంది కరడుగట్టిన నేరస్తులు!


నేరమయ రాజకీయ ముఖచిత్రం సీమాంధ్రలో విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది. ఇంచుమించు ప్రతి అసెంబ్లీ స్థానంలోనూ ఒక అభ్యర్థి చొప్పున నేరగాడు ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాల్లో 1309 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 277 మంది నేరగాళ్లు ఉన్నారని స్పష్టం చేసింది. వీరిలో తీవ్ర (కరడుగట్టిన) నేరాలు చేసినవారు 146 మంది.

పార్టీల వారిగా వారి వివరాలు...కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 20 మంది నేరగాళ్లు ఉండగా, టీడీపీలో నేరగాళ్ల సంఖ్య 73. వైఎస్సార్సీపీ తరపున అత్యధికంగా 89 మంది నేరగాళ్లు ఎన్నికల బరిలో ఉన్నారు. జైసమైక్యాంధ్ర పార్టీ తరపున 20 మంది నేరగాళ్లు పోటీ చేస్తున్నారు. వీరంతా ఎన్నికల బరిలో ఉండడంతో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది తీరును అంచనా వేయవచ్చని ఓటర్లు సెటైర్లు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News