: ఎన్నికల సంఘమే తనను ఓడిస్తోందంటూ సెల్ టవరెక్కిన ఎమ్మెల్యే అభ్యర్థి


ఎన్నికల సంఘం తీరుపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ స్వతంత్ర అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తప్పులు చేశారంటూ అభ్యర్థులపై చర్యలకు దిగే ఎన్నికల కమిషనే తప్పు చేసిందంటూ మండి పడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం స్వతంత్ర అభ్యర్థిగా జాన్సన్ ఎన్నికల బరిలోకి దిగాడు. దీంతో ఎన్నికల సంఘం అతడికి పెన్ గుర్తు కేటాయించింది. దీంతో అతను పెన్ గుర్తుతో ఉద్ధృత ప్రచారం నిర్వహించాడు.

ప్రచార గడువు ముగుస్తున్న సందర్భంలో బ్యాలెట్ పేపర్ లో పెన్ గుర్తుకు బదులుగా పెన్ స్టాండ్ గుర్తు ఉంది. దీంతో నివ్వెరపోయిన జాన్సన్ ఎన్నికల సంఘం అధికారులను నిలదీశాడు. వారు స్పందించకపోవడంతో తనను ఎన్నికల సంఘం ఓటమిపాలు చేస్తోందంటూ ఆందోళనకు దిగాడు. తనకు పెన్ గుర్తు కేటాయించాలని జాన్సన్ డిమాండ్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News