: ఈసీకి ఫిర్యాదు చేసిన రాయపాటి
గుంటూరు జిల్లా నర్సరావుపేట లోక్ సభ టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పోలీసుల వైఖరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ, మాచర్ల రూరల్ సీఐలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదని... పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.