: రోడ్ షోలకు జగన్ కోట్లు ఖర్చు చేస్తున్నారు: కారెం శివాజీ
వైకాపా అధినేత జగన్ పై మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ విరుచుకుపడ్డారు. మాలమహానాడు తరపున పోటీ చేస్తున్న 75 మంది అభ్యర్థులను జగన్ ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు కూడా పి.గన్నవరం సీటును ఇస్తానని ప్రలోభపెట్టారని చెప్పారు. దళితులపై వైకాపా దాడులకు పాల్పడుతోందని అన్నారు. 25 ఏళ్ల ఉద్యమ చరిత్ర కలిగిన తాను వైకాపా తీరుతో మనోవేదనకు గురవుతున్నానని చెప్పారు. జగన్ కు దళితుల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని తెలిపారు. రోడ్ షోల కోసం జగన్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.