: డెవిల్స్ అమ్ములపొదిలో పేస్ అస్త్రాలు


గాయాల బారినపడి గత కొంతకాలంగా క్రికెట్ కు దూరమైన యువ పేసర్ ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ లు మళ్ళీ మైదానంలో అడుగిడనున్నారు. వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిట్ నెస్ సాధించినట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ సలహాదారు టీఏ శేఖర్ తెలిపారు. ఉమేశ్.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడని శేఖర్ చెప్పారు.

నాలుగు నెలల విశ్రాంతి అనంతరం బరిలో దిగిన ఉమేశ్ , విదర్భ జట్టు తరుపున ఆడుతూ, ఒడిశాతో మ్యాచ్ లో 18 పరుగులకే 5 వికెట్లు తీసి పోరును మలుపు తిప్పాడని శేఖర్ వివరించారు. ఇక ఇర్ఫాన్ పఠాన్ కూడా ముస్తాక్ అలీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేశాడని చెప్పుకొచ్చారు. వీరిద్దరికి తోడు ఆశిష్ నెహ్రా కూడా బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటాడని ఆయన వెల్లడించారు.

న్యూజిలాండ్ డైనమిక్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ గైర్హాజరీలో నెహ్రా జట్టులోకి వస్తున్నట్టు చెప్పారు. సఫారీ పేసర్ మోర్నీమోర్కెల్ లేకుండానే బరిలో దిగుతున్నా.. ఉమేశ్, ఇర్ఫాన్, నెహ్రాలతో బౌలింగ్ విభాగం బలంగానే ఉందని శేఖర్ అన్నారు. 

  • Loading...

More Telugu News