: హైనాను కొట్టి చంపిన గ్రామస్థులు
గత అర్ధరాత్రి నుంచి అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో హల్ చల్ చేసిన హైనాను కొట్టి చంపారు. హైనా చేసిన దాడిలో 20 మంది గాయపడిన సంగతి తెలిసిందే. తొలుత దాడి చేసింది చిరుత అని భావించారు. కానీ, చివరకు హైనా అని తేలడంతో... గ్రామస్థులు దాన్ని వెతికి పట్టుకుని, కొట్టి చంపేశారు. దీంతో బుక్కపట్నం మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.