: చంద్రబాబు, లగడపాటి కుమ్మక్కయారు: లక్ష్మీపార్వతి


టీడీపీ అధినేత చంద్రబాబు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను లగడపాటి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో లగడపాటి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు, లగడపాటిలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. లగడపాటి ఓ జోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాల కోసం పోరాడుతున్న జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.

  • Loading...

More Telugu News