: అనంతపురం జిల్లాలో స్వైర విహారం చేసిన హైనా
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో హైనా స్వైర విహారం చేసింది. దాని ధాటికి 20 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి కొత్తకోట గ్రామంలో దాడి చేసి 8 మందిని గాయపరిచింది. తరువాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంగాలమ్మ చెరువు గ్రామంలో మరో సారి హైనా చేసిన దాడిలో 12 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కొందరిని పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రికి తరలించారు.