: నేడు చంద్రబాబు పర్యటన వివరాలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి బద్వేల్ వెళతారు. 11.30 గంటలకు అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉపన్యసిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కదిరి, 3.30 గంటలకు పీలేరు, 4.30 గంటలకు పుంగనూరు, 5.30 గంటలకు కుప్పం, 6.15 గంటలకు పలమనేరు బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు చిత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడతారు.