: దౌర్జన్యాలు, దోపిడీలు చేసేవారికి తల వంచను: పవన్ కల్యాణ్


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ... దేశ సంపదను కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మను కానని అన్నారు. పిచ్చి పిచ్చి వాగుడుతో దేశ సమగ్రతను దెబ్బతీస్తే ఊరుకోనని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. దౌర్జన్యాలు, దోపిడీలు చేసేవారికి తలవంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ లోక్ సభకు పోటీ చేస్తున్న విజయమ్మకు ఈ వయసులోనూ కష్టాలు తప్పటం లేదన్నారు. జగన్ కోసం ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తూ... మండుటెండల్లో ప్రచారం చేయడం చూస్తే తనకు బాధ కలుగుతోందని అన్నారు. తల్లిని సుఖపెట్టలేని వాడు ప్రజలను ఎలా సుఖపెడతాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News