: మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని మద్ది క్షేత్రానికి ఆయన చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసమని వచ్చిన చంద్రబాబు అంతకు ముందు సభా వేదిక దగ్గర్లోని మద్ది క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ఛైర్మన్, కార్యనిర్వాహణాధికారులు చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.