: తెలంగాణలో టీడీపీ కీలక భూమిక పోషించబోతోంది: మోత్కుపల్లి


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించబోతోందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. తెలంగాణలో హంగ్ వస్తుందన్నారు. ఇవాళ కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన ఎన్నిల ప్రచారంలో మోత్కుపల్లి పాల్గొన్నారు. నందిగామలో కృష్ణ ప్రసాద్ అరెస్ట్ రాజకీయ కుట్రేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంద్రలో టీడీపీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News