: గోవాతో పోల్చితే ఏపీలో అవినీతి ఎక్కువే: గోవా సీఎం మనోహర్ పారికర్
గోవాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఎక్కువేనని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అవినీతిని నిర్మూలిస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. ఇవాళ విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతాపార్టీ తరఫున పాల్గొన్న పారికర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గోవాలో అవినీతికి ఆస్కారం లేదు కాబట్టే అన్నీ చౌకగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. దేశం అభివృద్ధి పథాన పయనించాలంటే మోడీ లాంటి నాయకుడు అవసరమని పారికర్ అన్నారు.