: ఓట్లడిగి...ఒళ్లు మర్చిపోయి ఏసీలో పడుకోను: పవన్ కల్యాణ్


ఓట్లడిగి వెళ్ళిపోయి, ఒళ్లు మర్చిపోయి పడుకోనని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లా తగరపువలసలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడిస్తున్న హామీలు అమలు జరిపే బాధ్యత తనదేనని అన్నారు. 5 సంతకాలతో ప్రజల తలరాత మారుస్తానంటున్న జగన్ ను ఏ ఘనకార్యం చేసి జైలుకెళ్లాడో చెప్పాలని అడుగుతున్నానని అన్నారు. వైఎస్ బతికి ఉండగా ఎండ ముఖం చూడని అతని తల్లి ఎండల్లో మాడిపోతూ ప్రచారంలో ఉందని, కనీసం ఇంటికి కూడా వెళ్లడం లేదని ఆయన అన్నారు.

తల్లి క్షేమం కూడా చూడని జగన్ ప్రజా సంక్షేమం ఎలా చూస్తాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జగన్ గెలిస్తే, జప్తు చేసిన ఆస్తులను కూడబెట్టుకునేందుకు మరోసారి దోపిడీకి పాల్పడతాడని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దాని కారణంగా మరో ఉద్యమం పురుడుపోసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విజయమ్మను ఓడించి హరిబాబును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News