: 'గెలుపు బావదే' అంటున్న మహేష్
గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కోసం రాజకీయాలపై తొలిసారిగా సినీ నటుడు మహేష్ బాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ట్విట్టర్లో మహేష్ స్పందిస్తూ, బావ ప్రచారాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నానని, తప్పకుండా జయదేవ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. గుంటూరులో తన అభిమానులు, ప్రజలు జయదేవ్ ను తమ సొంత మనిషిలా చూసుకుంటున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.