: నన్ను కొట్టలేదు...ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకుంటా: శ్రీధర్
కాంగ్రెస్ నేత వరద రాజేశ్వరరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనపై దాడి చేశారనడం అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ తెలిపారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రి నుంచి ఆయన మాట్లాడుతూ, తాను కొంతమంది నేతల ఒత్తిడి తట్టుకోలేకపోయానని అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక డబ్బు కోసం తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని, దానిపై చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.