: చుండూరు కేసులో సుప్రీంను ఆశ్రయించాలని ప్రభుత్వ నిర్ణయం


గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితుల హత్య కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీ కోరడంతో ప్రభుత్వం అనుమతించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు 21 మందికి విధించిన యావజ్జీవ శిక్షను రద్దుచేసి, వారందరినీ విడుదల చేయాలని కొన్ని రోజుల కిందట హైకోర్టు ఆదేశించింది. వెంటనే ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News