: అంగారకుడిపై 'సెల్ఫీ' తీసుకున్న క్యూరియాసిటీ రోవర్
సెల్ఫీకి క్రేజెక్కువ... ఒబామా నుంచి మోడీ వరకు అందరూ సెల్ఫీ తీసుకుని సోషల్ నెట్ వర్క్ లో సందడి చేసేవారే. తాజాగా అంగారకుడి వరకు పాకిందీ సెల్ఫీ క్రేజ్. అంగారకుడిపై డ్రిల్లింగ్ మొదలు పెట్టిన నాసా ఉపగ్రహం క్యూరియాసిటీ రోవర్ పని చేస్తూ స్వంత ఫోటో తీసి పంపింది. అంగారక గ్రహంలో భౌగోళికంగా చాలా ముఖ్యమైన కింబర్లీ ప్రాంతంలో క్యూరియాసిటీ డ్రిల్లింగ్ ప్రారంభించింది. క్యూరియాసిటీ తీసుకున్న ఈ సెల్ఫీని డిస్కవరీ న్యూస్ ప్రచురించింది.