: చంద్రబాబు మాటలన్నీ బీసీల ఓట్ల కోసమే: వీహెచ్
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అంబర్ పేట అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు ఆరోపించారు. ఇవాళ హైదరాబాదులో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న చంద్రబాబు మాటలు... బీసీల ఓట్ల కోసమేనని అన్నారు. సీమాంధ్రలో బీసీలు టీడీపీకి మద్దతు పలికినా వారికి సీట్లు కేటాయించలేదని వీహెచ్ ఆరోపించారు.
చంద్రబాబు మాటలతో బీసీ నేత ఆర్.కృష్ణయ్య దారి తప్పారని వీహెచ్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్.కృష్ణయ్య గ్రహించాలని ఆయన హితవు పలికారు. టీడీపీలో బీసీలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఉండదని ఆయన స్పష్టం చేశారు.