: అక్కడ దొంగలంతా మహిళలే!


దేశ రాజధానిలో జేబుదొంగల్లో 94 శాతం మంది ఆడవాళ్లే. గత ఆరు నెలల్లో ఢిల్లీ మెట్రో రైలులో జేబులు కత్తిరించే కేసుల్లో దొరికిన వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం. బాధితుల్లో కూడా మహిళలే ఉండడం మరో విశేషం. రౌడీలు, రోమియోల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళలు ఎక్కువగా స్త్రీలకు కేటాయించిన పింక్ కంపార్ట్ మెంట్లను వాడుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న మహిళా జేబుదొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు.

గత ఆరు నెలల్లో అరెస్టయిన 126 మంది జేబుదొంగల్లో 118 మంది మహిళా దొంగలు ఉన్నారని, వీరంతా అదిరిపోయే ఇంగ్లిష్ మాట్లాడేస్తూ, ల్యాప్ టాప్ లు భుజాన వేసుకుని, అత్యాధునిక డ్రెస్సుల్తో రైలెక్కి తమ పని కానిచ్చేస్తున్నారట. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణికులూ... జాగ్రత్త మరి!

  • Loading...

More Telugu News