: బీజేపీ కిషన్ రెడ్డిని ఆకాశానికెత్తిన టీడీపీ రాజకుమారి


అసెంబ్లీలోపలా, బయటా కిషన్ రెడ్డి పోరాటపటిమపై రాష్ట్ర ప్రజలకు ప్రగాఢ విశ్వాసముందని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. విద్యుత్ సమస్య పై బీజేపీ చేస్తోన్న విద్యుత్ పోరు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. మండుటెండల్లో గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. 

కేంద్రంనుంచి పక్క రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్రాజక్టులు సాధించుకుంటుంటే, మన ఎంపీలు, కేంద్ర మంత్రులు విద్యుత్ కోసం 6,500 కోట్ల భారాన్ని తప్పించలేరా? అని రాజకుమారి ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 30 మంది ఎంపీలున్నా అధిష్ఠానం ముందు నోరెత్తే ధైర్యం వీరికి లేదని ఎద్దేవా చేశారు.   

  • Loading...

More Telugu News