: అమేధీలో రాహుల్ అనుచరుల రౌడీయిజం!


అమేధీలో రాహుల్ గాంధీ గెలుపు కోసం ఆయన సోదరి ప్రియాంకగాంధీ ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తుంటే... మరోవైపు రాహుల్ అనుచరులు (కాంగ్రెస్ కార్యకర్తలు) మాత్రం ప్రత్యర్థులపై నేరుగా దాడులకే దిగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రచార ర్యాలీపై దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. గౌరీగంజ్ లోని టికారియా పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద తమ పార్టీ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పార్టీకి చెందిన కొందరిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి కొట్టారని ఆమ్ ఆద్మీ నేత పంకజ్ శుక్లా మీడియాకు తెలిపారు. దీనిపై ఆమ్ ఆద్మీ తరపున అమేధీలో రాహుల్ పై పోటీకి దిగిన కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ... ఎన్నికల్లో వస్తున్న తక్కువ స్పందన చూసే కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశతో ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News