: సోనియాకు శంకరరావు కుమార్తె ఫిర్యాదు
తన తండ్రి శంకరరావు విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన కూతురు సుస్మిత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులకు ఈ రోజు విడివిడిగా లేఖలు రాసారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రికి నచ్చడం లేదని ఆమె అందులో పేర్కొన్నారు. డీజీపీ దినేష్ జగన్ కు సమీప బంధువు అని, అందుకే డీజీపీ, ముఖ్యమంత్రి కలిసి తన తండ్రిపై కక్ష సాదిస్తున్నారని సుస్మిత లేఖలలో ప్రస్తావించారు. ఇందుకు తన తండ్రి శంకరరావు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు.