: అమెరికాలో యోగా నేర్పుతోన్న ఆ బాలిక వయస్సు 12 ఏళ్లే!
ఆ బాలిక వయస్సు 12 ఏళ్లే... అయితేనేం, అమెరికాలో ఇప్పుడా బాలిక పలువురికి యోగా నేర్పుతోంది. కాలిఫోర్నియాకు చెందిన జేసియా దేవూ అమెరికాలో అత్యంత చిన్న వయస్సున్న యోగా శిక్షకురాలిగా గుర్తింపు పొందింది. బెర్గామోట్ స్పాలో యోగా ట్రెయినర్ గా పేరు నమోదు చేయించుకున్న జేసియా... తన 200 గంటల సర్టిఫైడ్ యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవలే పూర్తి చేసింది. చిన్న వయస్సులోనే శ్రద్ధగా యోగాను నేర్చుకున్న జేసియా... దేశ విదేశాల్లోని పలువురు ప్రముఖులను ఆకట్టుకుంది. రోజూ గంటసేపు ధ్యానం చేసే జేసియా... ‘ఇదొక ఆధ్యాత్మిక ప్రయోగం. యోగాతో నా ఆత్మను, శరీరాన్ని ఎలా నియంత్రించవచ్చో గమనించాను’ అని చెప్పింది.