: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన కాపునాడు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపునాడు మద్దతు ఇస్తోందని ఏపీ కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాపు కులస్థులకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వైఎస్ఆర్ నిరంతరం పోరాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే కాపు సామాజిక వర్గమంతా ఉంటుందన్నారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపులకు సముచిత స్థానం కల్పించిందని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News