: పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన హీరో రాజా
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సినీ హీరో రాజా నిప్పులు చెరిగారు. ఇవాళ కాకినాడకు వచ్చిన రాజా మీడియాతో మాట్లాడుతూ... ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టులు చదువుతూ జగన్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతనైతే పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయం గురించి పవన్ ఎప్పుడైనా స్పందించారా? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుది అవసరానికి వాడుకుని వదిలేసే తత్వమని రాజా ఆరోపించారు. గత ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్ ను వాడుకున్నట్లే... ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను వాడుకుని వదిలేస్తారని రాజా అన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ ను ఓదార్చడానికి వైఎస్ జగన్ వస్తారని రాజా వ్యాఖ్యానించారు.