: అనంతపురంలో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు చోరీకి విఫల యత్నం
అనంతపురం పట్టణంలోని హౌసింగ్ కాలనీలో ఉన్న ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో చోరీకి దుండగులు తీవ్రంగా ప్రయత్నించారు. బ్యాంకులోని సైరన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.