: ఓటెవరికి వేశాడో చెప్పలేదని కొట్టి చంపేశారు


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో గూండాలు రాజ్యమేలుతున్నారు. ఓటు ఎవరికి వేశాడో చెప్పనందుకు ఓ 80 ఏళ్ల వృద్ధుడిని కొట్టి చంపేశారు. ఝాన్సీ జిల్లాలోని లలిత్పూర్ లోక్సభ స్థానానికి చెందిన జంగీ లాల్ అనే వృద్ధుడిని కొందరు దుండగులు గ్రామ సమీపంలోని ఓ ఆలయంలోకి తీసుకెళ్లారు. దేవుడి మీద ప్రమాణం చేసి, ఎవరికి ఓటేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

వివరాలు వెల్లడించేందుకు నిరాకరించడంతో, అతనిపై దాడికి దిగారు. దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగులను అరెస్టు చేసినప్పటికీ, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వృద్ధుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News