: అక్షయ తృతీయ సందర్భంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి 30, 390 రూపాయలుగా ఉంది. కిలో వెండి 430 రూపాయలు తగ్గి 41, 650 రూపాయలు పలుకుతోంది. దీంతో బంగారం దుకాణ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధర తగ్గడంతో బంగారం అమ్మకాలు జోరందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.