: కేసీఆర్ అంటే జగన్ కి భయమా?: పవన్ కల్యాణ్


కేసీఆర్ సీమాంధ్ర ప్రజల్ని బూతులు తిడుతుంటే తాను సీమాంధ్రుడ్ని అని చెప్పుకున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎందుకు స్పందించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అంటే జగన్ కు భయమా? అని నిలదీశారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ప్రజలపై విపరీతమైన ప్రేమ కలిగిందని ఆయన అన్నారు.

అందుకే జగన్ ఓదార్పు యాత్ర ఎంతకీ తెగడం లేదని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News