: బీటిల్సా.. మజాకా..!


అరవై, డెబ్భయ్యవ దశకాల్లో ప్రపంచ సంగీత అభిమానులను ఉర్రూతలూగించిన రాక్ కళాకారుల్లో బీటిల్స్ ది అగ్రస్థానం. వారు గిటార్ మీటితే.. అభిమానుల హృదయ తంత్రులు వాటికవే రాగాలు పలుకుతాయి. వారు గొంతు సవరించుకుంటే.. ఆడియెన్స్ మునివేళ్ళపై నిలుచుంటారు, నర్తించేందుకు ఇక అట్టే వేచి ఉండలేమంటూ. వారి ఆల్బమ్ విడుదలైందంటే చాలు హాట్ కేకులను తలపించేలా అమ్మకాలు సాగుతాయి, ఆడియో కంపెనీలకు లాభాలు వెల్లువెత్తుతాయి.

ఇప్పటికి వారి ప్రాభవం ఏమీ తగ్గలేదని చెప్పేందుకు తార్కాణంలా.. గతంలో రూపొందించిన 'సార్జెంట్ పెప్పర్స్ లోన్లీ హార్ట్స్ క్లబ్ బ్యాండ్' ఆల్బమ్ తాజాగా లండన్ లో జరిగిన ఓ వేలంలో రూ. 1.5 కోట్లు పలికిందట. ఓ అజ్ఞాత అభిమాని ఒకరు ఈ ఆల్బమ్ ను దక్కించుకున్నాడు. ఇటీవలే బీటిల్స్ కు చెందిన పాత ఫొటో ఒకటి కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News