: ఎయిడ్స్ వ్యాధికి మందు దొరికిందీ...


విశ్వవ్యాప్తంగా శృంగార ప్రియులను హడలెత్తించిన ఎయిడ్స్ మహమ్మారి అంతానికి.. ఆరంభం ఇప్పుడు వచ్చింది. హెచ్ఐవీ వైరస్ లోని ఒక జన్యువును తొలగించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. దీనిని అమెరికాలోని ఉత్తర కరోలినా హెల్త్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు.

మానవశరీరంలో ఉండే `ఎపీఓబీఈసీ3` అనే ప్రొటీన్ల సమూహం హెచ్ఐవీ వైరస్ ను పూర్తిగా నాశనం చేయగలదు. ఈ వైరస్ లో ఉండే `వీఐఎఫ్` అనే జన్యువు వైరస్ వ్యాప్తి ప్రక్రియను అడ్డుకుంటుంది. వైరస్ లోని ఆ జన్యువుని తొలగించిన అనంతరం ఈ ప్రోటీన్ల సమూహం దానిని నిర్వీర్యం చేసినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ విక్టర్ గార్సియా తెలిపారు. ఈ ఆవిష్కరణతో ఎయిడ్స్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవచ్చని ఆయన వెల్లడించారు.

ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో అభివృద్ధి పొంది, హెచ్ఐవీ వైరస్ విరుగుడు మందు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వస్తే..మనిషి  అవయవాలన్నిటినీ నిర్వీర్యంచేసి, అతి భయంకరంగా ప్రాణాలను హరించే ఎయిడ్స్ భూతాన్ని తరిమికొట్టే సమయం అనతికాలంలోనే రావచ్చన్నమాట.   

  • Loading...

More Telugu News